Site icon NTV Telugu

Manickam Tagore : ఠాగూర్ ఆసక్తికర ట్వీట్.. రాజగోపాల్‌ రెడ్డికి 22 వేల కోట్లు

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

తెలంగాణ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరడంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ సారి మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి చేరినట్లు కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

 

ఆయన వీడియోలో గూగుల్‌ పే ద్వారా అమిత్‌ షా రాజగోపాల్‌ రెడ్డికి స్విస్‌ బ్యాంక్‌ నుంచి రూ.22 వేల కోట్లు పంపినట్లు చూపించారు. అంతేకాకుండా.. ఠాగూర్ మునుగోడుని అమ్మకానికి రాజగోపాల్ పెట్టినట్టు చాటింగ్ క్రియేట్ చేశారు. అయితే.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే.. ప్రస్తుతం మునుగోడులో నామినేషన్ల పర్వం సాగుతోంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

Exit mobile version