Site icon NTV Telugu

Manickam Tagore : టీకాంగ్రెస్‌కు షాక్‌.. ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌

Manickam Tagrore

Manickam Tagrore

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులు అంతర్గత విభేదాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపింది. అయితే.. కమిటీల్లో తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని బహిరంగంగానే తమ అసంతృప్తి గళాలు వినిపించిన, అసంతృప్తితో ఉన్న నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ ఫోన్లో చర్చించారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌తో టీకాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. పార్టీలో అలజడికి కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్‌చార్జ్ గా ఉన్న మాణికం ఠాగూర్‌ అని ఆరోపించినట్లు, చాలా మంది సీనియర్ నేతలు మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?
మాణిక్కం ఠాగూర్‌ వ్యవహార శైలి వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఠాగూర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. అయితే.. అనూహ్యంగా నేడు టీకాంగ్రెస్‌ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మాణిక్కం ఠాగూర్‌ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారల ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. అదే సమయంలో తెలంగాణ వాట్సప్‌ గ్రూప్‌ నుంచి మాణిక్కం ఠాగూర్‌ లెఫ్ట్‌ అయ్యారు.
Also Read : Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఆమోదం

Exit mobile version