Site icon NTV Telugu

Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!

Saipallavi,vijay Sedupathi, Saipallavi

Saipallavi,vijay Sedupathi, Saipallavi

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి అని నమ్మే దర్శకుడు మణిరత్నం.. తన తదుపరి చిత్రం కోసం ఒక క్రేజీ కాస్టింగ్‌ను సెట్ చేశారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్ సేతుపతి, సహజ సిద్ధమైన నటనతో మెప్పించే సాయి పల్లవి మొదటిసారి ఈ సినిమాలో జతకట్టబోతున్నారు. మద్రాస్ టాకీస, లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also Read :Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో షూటింగ్‌ను మేకర్స్ ఈ ఏప్రిల్ నెలలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అందరూ ఎదురుచూస్తున్న రెగ్యులర్ షూటింగ్ వేసవి కానుకగా జూన్ 2026 లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవి తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, మణిరత్నం సినిమా కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో తెలిసిందే. సాయి పల్లవి వంటి నటి ఆయన దర్శకత్వంలో నటిస్తుందంటే, ఆ పాత్ర డెప్త్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే విజయ్ సేతుపతి విలక్షణమైన నటన ఈ చిత్రానికి అతిపెద్ద అసెట్ కానుంది. ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version