Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి అని నమ్మే దర్శకుడు మణిరత్నం.. తన తదుపరి చిత్రం కోసం ఒక క్రేజీ కాస్టింగ్‌ను సెట్ చేశారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్ సేతుపతి, సహజ సిద్ధమైన నటనతో మెప్పించే సాయి పల్లవి మొదటిసారి ఈ సినిమాలో జతకట్టబోతున్నారు. మద్రాస్ టాకీస, లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read :Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!
Also Read
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో షూటింగ్‌ను మేకర్స్ ఈ ఏప్రిల్ నెలలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అందరూ ఎదురుచూస్తున్న రెగ్యులర్ షూటింగ్ వేసవి కానుకగా జూన్ 2026 లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవి తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, మణిరత్నం సినిమా కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో తెలిసిందే. సాయి పల్లవి వంటి నటి ఆయన దర్శకత్వంలో నటిస్తుందంటే, ఆ పాత్ర డెప్త్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే విజయ్ సేతుపతి విలక్షణమైన నటన ఈ చిత్రానికి అతిపెద్ద అసెట్ కానుంది. ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!