కొంత మంది వింత చేష్టలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మందు తాగి నానా హంగామా చేస్తుంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు.. లేదా అటుగా పోయే వారిపై దాడులకు సైతం దిగుతారు మందుబాబులు.. అయితే, మందుబాబులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్ర స్థాయిలో కట్టడి చేస్తున్నప్పటికి అవి ఫలించకపోవడంతో వారు రెచ్చిపోతున్నారు.
Read Also: Devendra Fadnavis: “బీజేపీకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం”.. రాహుల్ గాంధీపై దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు..
తాజాగా, నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎస్పీజీ గ్రౌండ్స్ లో మందుబాబుల హల్ చల్ చేశారు. గ్రౌండ్స్ లో కారు ఆపి మందు కొడుతూ కేకలు వేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక, మందుబాబులను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులతో వారు గొడవకు దిగారు. పోలీసుల జీప్ ను కదలనివ్వమని మందుబాబులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తమకు తెలుసు అంటూ పోలీసులపైకి మందుబాబులు బెదిరింపులకు దిగారు. దీంతో మరో వాహనంలో ఎస్పీజీ గ్రౌండ్స్ కు పోలీస్ సిబ్బంది చేరుకుంది. ఇక, కారును స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.