NTV Telugu Site icon

Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది

Mandakrishna Madiga

Mandakrishna Madiga

Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం మొదటి నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసమే పోరాడుతున్నామని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణను నాలుగు గ్రూపులు చేయాలని కోరామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీ గ్రూపులో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న వర్గాన్ని మొదటి గ్రూపులో చేర్చారన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోటుపాట్లను సీఎం సరిదిద్దుతారని భావిస్తున్నామని ఆయన అన్నారు.

Car Discounts : మారుతి, మహీంద్రా, హోండాకు చెందిన ఈ 10 కార్లపై.. రూ. 4 లక్షల వరకు డిస్కౌంట్!

అయితే.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను మందకృష్ణ మాదిగ అభినందించారు. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్న మందకృష్ణ మాదిగ అన్నారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు మందకృష్ణ మాదిగ. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామన్నారు సీఎం. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు ప్రతినిధులు.. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

Prudhvi Raj: ‘లైలా’ చిచ్చు లేపి ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి రాజ్