Site icon NTV Telugu

Manchu Manoj: మంచు మనోజ్ ‘బ్రూటల్ ఎరా’ నుండి ఒకేరోజు రెండు పవర్‌ఫుల్ అప్‌డేట్స్!

Manchu Manoj

Manchu Manoj

రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే మనోజ్, తాజాగా ‘బ్రూటల్ ఎరా’ (Brutal Era) పేరుతో ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read : Mouni Roy: ఫొటోల పేరుతో అసభ్య ప్రవర్తన.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన మౌని రాయ్

ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో.. తాజా సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11:11 గంటలకు “RUTHLESS” పేరుతో ఒక అప్‌డేట్, అలాగే సాయంత్రం 4:44 గంటలకు “BRUTAL” పేరుతో మరో అప్‌డేట్ రానుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ తన ట్వీట్‌లో “Brutal Era begins tomorrow” అని పేర్కొనడం చూస్తుంటే, ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. మరి ఈ ‘బ్రూటల్ ఎరా’తో మనోజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

 

Exit mobile version