NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : ముఖ్యమంత్రి విద్య, వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు

D Sridhar Babu

D Sridhar Babu

Duddilla Sridhar Babu : మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కావస్తుందని, 300కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం మహారాష్ట్రతో పాటు జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారని, నిర్మాణం తో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్య కు కేటాయించామని ఆయన వెల్లడించారు. నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు అని, మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చి న ఘనత మీ ఎమ్మెల్యేది అని, బీఆర్‌శ్రీస్‌, బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)

నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, 6గ్యారెంటీ లను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. 18వేల కోట్ల రుణమాఫీ చేసినం వరి కి 500 బోనసు ఇస్తున్నామని, కొత్తగనులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. నైనీబొగ్గు బ్లాక్ లను సింగరేణి వచ్చేలా కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు ఏం పని చేశారని విమర్శించడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిందని, మంచిర్యాలలో మరో 29 సబ్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాలలో నాలుగు క్యాన్సర్ సెంటర్ లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ట్రామా సెంటర్ నిర్మాణం చేపడతామని, మంచిర్యాల జిల్లాకు 30 డయాలసిస్ బెడ్స్,, మిషన్స్ త్వరలో అందజేస్తామన్నారు. జిల్లాలో రెండు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసి 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..