IND vs AFG: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన భారత్‌కు ప్రత్యుత్తరంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మత్ షా మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. అతడు 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ (16), సెదీకుల్లా అతల్ (17), హష్మతుల్లా షాహిదీ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన టెస్ట్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. తొలి టెస్టులోనే అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన అతడు 22 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు భారీ స్కోరు నమోదు చేశారు. కెఎల్ రాహుల్ 100 పరుగులు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో అద్భుత శతకం నమోదు చేశారు. సాయి సుదర్శన్ 81, రిషభ్ పంత్ 81 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడారు. వాషింగ్టన్ సుందర్ అజేయంగా 52 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ లో వరుసలో మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22 పరుగులతో భారీ స్కోర్ అందించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ.. భారత బ్యాటర్లను నిలువరించలేకపోయాడు. ఫలితంగా భారత్ 564 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
మూడో రోజు ఆట తొలి సెషన్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది. 412 పరుగుల భారీ లీడ్‌తో ఉన్న టీమిండియా ఫాలోఆన్ అమలు చేయడంతో రెండో ఇన్నింగ్స్ ను ఆఫ్ఘనిస్తాన్ మొదలు పెట్టనుంది. ప్రస్తుతం మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది.
The fifth one always hits different 🌟
A moment Manav Suthar will replay for the rest of his life 🎞️
Updates ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/yUo8AsXHZu
— BCCI (@BCCI) June 8, 2026

