Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభించిన స్వల్ప కాలంలోనే తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టి, భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సుతార్ కీలకంగా వ్యవహరించాడు. తన 21.4 ఓవర్ల కోటాలో 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాతో కలిసి పిచ్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో సుతార్ మరింత ప్రమాదకరంగా మారాడు. శ్రీలంక బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 23.4 ఓవర్లలో కేవలం 55 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పిచ్‌పై లభిస్తున్న టర్న్‌ను వాడుకుంటూ వరుసగా వికెట్లు తీసి లంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి వికెట్‌గా కేశర నువంత (20)ను క్విక్కర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను ముగించడంతో పాటు, తన కెరీర్లో తొలిసారిగా ఒకే టెస్టులో 10 వికెట్ల మైలురాయిని అందుకొని గాల్లోకి పంచ్ విసురుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Also Read
జూన్ 2026లో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ స్పిన్ సంచలనం, ఇంత తక్కువ సమయంలోనే జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న తీరు అద్భుతం. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు మానవ్ సుతార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుతార్ ప్రదర్శించిన క్రమశిక్షణ, లైన్ అండ్ లెంగ్త్ భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!