Site icon NTV Telugu

Chiranjeevi : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకరవరప్రసాద్ గారు’

Msvg

Msvg

మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా MSG రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా MSG కేవలం 15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఉత్తర అమెరికాలో, ఈ చిత్రం $3.5 మిలియన్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఇదే బిగ్గెస్ట్ గ్లోబల్ ఎర్నర్ గా నిలిచింది.

Also Read :Chiranjeevi : అనిల్‌’తో మరో సినిమా కోసం మెగా ఇంట్రెస్ట్?

MSG ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించారు.

ఈ చిత్రం అనేక చారిత్రాత్మక మైలురాళ్లను సాధించింది:
నార్త్ అమెరికాలో చిరంజీవి & అనిల్ రావిపూడి కెరీర్‌లో ఆల్‌టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్.
తెలుగు రాష్ట్రాల్లో డే 5, డే 7, డే 14 నాటికి ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసింగ్ రికార్డ్స్
కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలు
అనిల్ రావిపూడికి ఇది వరుసగా రెండో రీజినల్ ఇండస్ట్రీ హిట్, మొత్తం మీద 9వ కంటిన్యూస్ బ్లాక్‌బస్టర్.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్ట్రాంగ్ మోమెంటంతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేట్రికల్ రన్ ముగిసే సరికి ₹400 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయం.

Exit mobile version