మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా…