Site icon NTV Telugu

Mana ShankaraVaraPrasad Garu: వీక్‌డేస్‌లోనూ హౌస్‌ఫుల్స్‌.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!

Mana Shankaravaraprasad Garu

Mana Shankaravaraprasad Garu

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్‌ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది.

Also Read : Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..

ఇక సమాచారం ప్రకారం ఈ చిత్రం వీక్ డేస్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటుతోంది. ముఖ్యంగా భోగి పండుగ రోజున ఈ సినిమా బుకింగ్స్ పరంగా అదిరిపోయే పికప్‌ను అందుకుంది. గత 24 గంటల్లో బుక్ మై షో లో ఏకంగా 4 లక్షల టికెట్ సేల్స్ మార్కును ఈ చిత్రం క్రాస్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా గంటకు 22 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. మొత్తనికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, షైన్ స్క్రీన్స్.. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ వారి భారీ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని సంక్రాంతి బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టాయి.

Exit mobile version