Site icon NTV Telugu

MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్: చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Manashnkaravaraprasad Garu

Manashnkaravaraprasad Garu

సంక్రాంతి రేసులో ప్రజంట్ తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రీమియర్ షోలకు ముందే ఈ చిత్ర క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటి అంటే

Also Read : Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..

సినిమా క్లైమాక్స్‌లో నయనతార ఆమె కుటుంబ సభ్యులను విలన్లు టార్గెట్ చేసినప్పుడు, వారిని కాపాడే క్రమంలో చిరంజీవికి తోడుగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఈ ఇద్దరు టాప్ హీరోలు కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా సాహు గారపాటి సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదభరితంగా సాగుతుందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

పండగ వాతావరణానికి తగ్గట్టుగా కామెడీ, ఎమోషన్స్ మెగా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా చిరంజీవి తన పాత సినిమాల తరహాలో ఫుల్ ఎనర్జీతో చేసిన అల్లరి ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న ఈ ‘శంకరవరప్రసాద్‌’, రేపు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తాడో అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version