Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mana Shankar Varaprasad Garu OTT Rights: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారని టాక్ నడుస్తుంది. మరో వైపు ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వెండి తెరపైకి రానున్న ఇతర సినిమాలు కూడా షూటింగ్‌ల వేగాన్ని పెంచాయి. ఆయా సినిమాల చిత్రీకరణలు డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసుకుని, కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రచార కార్యక్రమాలను చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.
READ ALSO: Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?
Also Read
ఇదే ఊపులో ఆయా సినిమాల మేకర్స్ ఓటీటీ సహా అన్నీ డీల్స్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఓటీటీ రైట్స్ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సర్కిల్లో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ 5, జీ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వచ్చిన అనిల్ రావిపూడి – వెంకటేశ్‌ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓటీటీ రైట్స్‌ను కూడా జీ నెట్వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే బాటలో ఈ కొత్త సినిమా కూడా వెళ్తున్నట్లు సమాచారం. అయితే జీ గ్రూప్ నిజంగానే ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందా? ఆ డీల్ ఎంత? అనే తెలియరాలేదు. సినీ సర్కిల్లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారంపై ఇప్పటి వరకు జీ నెట్వర్క్ గానీ, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చూడాలి మరి మన శంకర్ వరప్రసాద్‌గారు ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుందో లేదో అనేది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?