Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mana Mitra WhatsApp Service for Cyclone Relief: ‘మురసు’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, చెట్లు లేదా గోడలు కూలినా, ఇళ్లలోకి నీరు చేరినా.. ఇతర అత్యవసర సమస్యలు ఎదురైనా ప్రజలు మనమిత్ర ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా నమోదు చేస్తే.. సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం చేరవేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ఈ సేవను రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది.
మనమిత్రలో సమస్యను ఎలా నమోదు చేయాలి?:
తుఫాన్ బాధితులు ముందుగా 9552300009 వాట్సాప్ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం అక్కడ కనిపించే సేవల జాబితాలో సంబంధిత ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ‘Murasu Cyclone Issue’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని.. ‘Report Issue’పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఆపై ‘Registration’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని.. తమ పేరు, జిల్లా, మండలం వివరాలను నమోదు చేయాలి. అనంతరం తమ ప్రాంతంలో తుఫాన్ కారణంగా ఎదురవుతున్న సమస్యను వివరంగా తెలియజేయాలి. అవసరమైతే సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేయవచ్చు.
Also Read
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
సమస్యను అధికారులకు వెంటనే చేరవేత:
మనమిత్ర ద్వారా నమోదు చేసిన ఫిర్యాదును సంబంధిత ప్రాంత అధికారులకు పంపిస్తారు. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను త్వరగా గుర్తించి.. పరిష్కార చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. తుఫాన్ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు కింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ఏపీఎస్డీఎంఏ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు:
112
1070
18004250101
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!