NTV Telugu Site icon

Karnataka: సీఎం కార్యక్రమంలో భద్రతా లోపం.. సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు

Karnataka

Karnataka

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఆ యువకుడిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: Team India: ఈ ముగ్గురు యువ ఆటగాళ్ళు మున్ముందు రికార్డులు నెలకొల్పుతారు..

ఈ యువకుడి ఈ చర్యకు గల కారణం తెలియరాలేదు. ఆ వ్యక్తిని మహదేవ్ నాయక్ గా గుర్తించారు. కాగా.. ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం సీఎంని చూసేందుకు మాత్రమే ఇలా వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కేవలం ప్రోటోకాల్‌ ప్రకారం అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. సీఎంకి శాలువా ఇచ్చేందుకు వచ్చినట్టు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Read Also: R. Ashwin: రిటైర్మెంట్పై టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక ప్రకటన..

Show comments