కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.