NTV Telugu Site icon

Police Vehicle: అరే ఏంట్రా ఇది.. ఫిర్యాదును నిరాకరించారని పోలీసు వాహనాన్నే..

Police Vehicle

Police Vehicle

Police Vehicle: ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి ఒడిశా పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను దోచుకున్నారని ఫిర్యాదు చేయడానికి రాగా.. ఒడిశా పోలీసులు నిరాకరించారని, దానికి ప్రతీకారంగా వారి వాహనాన్ని దొంగిలించానని ఈ వ్యక్తి పేర్కొన్నాడు. ఒడిశా పోలీసు వాహనాన్ని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నడుపుతుండగా పట్టుకున్నామని, అతను తన స్వస్థలమైన రాజమండ్రి వెళ్లేందుకు పోలీసు వాహనాన్ని దొంగిలించినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్‌ చేసి పోలీసు వాహనం గురించి ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Uttarpradesh: దారుణం.. జామకాయను కోసినందుకు కొట్టి చంపేశారు..

ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. అతను రాయగడలో అమ్మవారిని పూజించడానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దోచుకున్నారు. దానిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లగా వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించలేదు. అందుకే కోపంతో పోలీసులు వాహనాన్ని ఎత్తుకొచ్చినట్లు అతను చెప్పాడని పార్వతీపురం ఎస్సై వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్‌లో పోలీసులు ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయగడ పోలీసు శాఖ అధికారులు అతన్ని కొట్టి బయటకు లాగేశారని ఎస్సై తెలిపారు. అయితే కేసును ముగించలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.