Uttarpradesh: కేంద్రమంత్రి ఇంట్లో శవం..కొడుకు పైనే అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man shot dead at Union Minister Kaushal Kishore’s Home: సెంట్రల్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మినిస్టర్ కౌషల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడి శవం కనిపించడంతో కలకలం రేగింది. మృతుడిని 30 ఏళ్ల వినయ్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. చనిపోయిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అంతేకాదు వినయ్ బీజేపీ కార్యకర్త కూడా. శుక్రవారం తెల్లవారు జామున 4.15 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని బెగారియా గ్రామంలో మంత్రి ఇంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం అని వినయ్ ను పిలిచారు. అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవను తలలో కాల్చి చంపారు.
Also Read: Asaduddin Owaisi: సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు..మజ్లిస్ అభ్యర్థిపై కేసు నమోదు
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
అయితే చంపడానికి ఉపయోగించిన గన్ మంత్రి కుమారుడు అషు లైసెన్స్డ్ రివాల్వర్ గా తెలుస్తోంది. అయితే హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉన్నారు. వెంటనే ఆయన పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గన్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువకుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు. మరణించిన యువకుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల పై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ముగ్గురును అదుపులోకి తీసుకున్నట్లు లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు.ఇక ఈ విషయం గురించి బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, అయితే ఆ సమయంలో తన ఇంట్లో ఎవరు ఉన్నారన్న విషయం తెలియదని పేర్కొ్న్నారు. తన కుమారుడు వికాస్ కూడా ఆ సమయంలో ఇంట్లో లేడని,అతడి భార్య ఢిల్లీలో ఉంటుందని, ఆమె ఆరోగ్యం పాడైతే ఆసుపత్రిలో చేరిందని తెలిపారు మంత్రి. ఘటన జరగడానికి ముందు రోజే వికాస్ తన భార్య దగ్గరకు ఢిల్లీ వెళ్లాడని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!