Site icon NTV Telugu

Crime News: అనుమానం పెనుభూతమై.. గొంతు నులిమి భార్య హత్య.. శవాన్ని ముక్కలు చేసి..

Crime News

Crime News

Crime News: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ దారుణం బెంగాల్‌లో బిష్ణుపుర్​ ప్రాంతంలో చోటుచేసుకుంది. ముర్షీదాబాద్‌లో నివాసముంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న నిందితుడు అలీమ్‌ షేక్‌కు పన్వార మండలానికి చెందిన ముంతాజ్‌ షేక్‌కు దాదాపు 20 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పెళ్లి తర్వాత అలీమ్ తన అత్తమామలు ఉన్న బిష్ణుపుర్‌లోని చిట్‌భాగి ప్రాంతానికి నివాసం మార్చారు. అలీమ్ సర్దా గార్డెన్స్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ముంతాజ్ సమాలీ ప్రాంతంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసేది. రోజులాగే మంగళవారం ఉదయం పనికి వెళ్లేందుకు ముంతాజ్ తన భర్త అలీమ్‌తో కలిసి బయలుదేరింది. ఆరోజు రాత్రైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అలీమ్ ఎప్పటిలాగే రాత్రి తన అత్తమామల ఇంటికి వచ్చాడు. అయితే బుధవారం ఉదయం వరకు ముంతాజ్​ కనిపించకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Acid Attack: కోర్టు ఆవరణలోనే భార్య ముఖంపై యాసిడ్‌తో దాడి

రంగంలోకి దిగిన పోలీసులు అలీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే భార్య ముంతాజ్‌ను హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు భార్యను హత్య చేసి ఆమెను ముక్కలుగా నరికాడు. అనంతరం దగ్గర్లోని ఓ చెరువు వద్ద వాటిని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. పాతిపెట్టిన చోటుకు హంతకుడు అలీమ్‌ను తీసుకెళ్లి మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై ఉన్న అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు అలీమ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Exit mobile version