NTV Telugu Site icon

Man Killed Son-in-Law: కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. అల్లుడిని నడిరోడ్డుపై..

Tamilnadu

Tamilnadu

Man Killed Son-in-Law: కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. కాలు కందకుండా గుండెలపై మోసారు.. కంటికి రెప్పలా చూసుకున్నారు.. కంట నీరు కారకుండా కాపాడుకున్నారు.. అడిగిందల్లా ఇచ్చారు… కానీ కన్నపేగు తమ మాట వినకుండా మరొకరిని ఇష్టపడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. వద్దన్నా వినకుండా ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు… కన్న కూతురు తమ మాట వినలేదని… ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. మానసికంగా కుంగిపోయారు. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి సైతం సిద్ధపడ్డాడు ఆ తండ్రి.

Read Also: Crime News: దారుణం.. తరగతి గదిలోనే ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలోని కేఆర్‌పీ డ్యామ్‌ హై వే రోడ్డు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాట వినకుండా పెళ్లి చేసుకుందని తండ్రి కూతురుని అల్లుడిని చంపేశాడు. కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రి అల్లుడిని నడి రోడ్డుపై దారుణంగా చంపేశాడు. తమిళనాడులో రెండు నెలల క్రితం శరణ్య, జగన్‌లు తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని కసితో మధ్యాహ్నం ఇంటికి వెళుతున్న అల్లుడు జగన్‌ను అడ్డగించి శరణ్య తండ్రి, అతని స్నేహితులు కత్తులతో పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శరణ్య తండ్రిని అరెస్టు చేశారు.