NTV Telugu Site icon

Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ

Weddi Ng Card

Weddi Ng Card

Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి. దీంతో అమ్మాయిలు 30+వారిపై ఆసక్తి కనబరచడం లేదు. ఇక 40దాటితే అంతే సంగతులు ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండి పోవాల్సిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పెళ్లి పత్రికను చూసి పెళ్లికాని ప్రసాదులంతా కుళ్లుకుంటున్నారు. మాకు ఒక్కమ్మాయి దొరకడం లేదు పెళ్లి చేసుకుందామంటే.. నీకు ఇద్దరేంటి సామీ అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు.

Read Also: SSMB 28: సెంటిమెంట్ తో టైటిల్ సెట్ చేస్తున్న మాటల మాంత్రికుడు

ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇవాళే ఆ పెళ్లి జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నట్లు వెడ్డింగ్ కార్డులో ఉంది. వ్యవసాయ కూలీ అయిన సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపారు. ఈ విషయం తెలుసుకున్న సునీత సత్తిబాబును నిలదీసింది.

Read Also: Sleep : నిద్ర సరిగా లేకపోతే ఎంత డేంజరో తెలుసా ?

దాంతో.. సత్తిబాబు ఇద్దరితోనూ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోకుండా ఏడాదిగా సత్తిబాబు ఈ ఇద్దరితోనూ కాపురాన్ని ప్రారంభించాడు. పైగా వీరిద్దరికీ ఒక్కో సంతానం ఉన్నారు. ఇక ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వాస్తవానికి కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆచారం. వీరు కూడా అదే సంప్రదాయాన్ని పాటించి, ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, తమ పెళ్లి అందరి పెళ్లి మాదిరిగానే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంపారు. ఆ శుభలేఖలో వరుడి పేరు, ఇద్దరు వధువుల పేర్ల ఉండటంతో అంతా షాక్ అయ్యారు. కారణం తెలుసుకుని కొంతమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.