RTI Query: కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి ఏకంగా 40 వేల పేజీల సమాచారం అధికారుల నుంచి అందింది. ఆ పత్రాలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లేందుకు ఏకంగా తన ఎస్‌యూవీని వినియోగించాల్సి వచ్చింది. వాస్తవానికి పేజీకి రూ.2 చొప్పున రూ.80వేలు చెల్లించాల్సి ఉండగా.. ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమాచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది.
Also Read: Girl friend for free: గర్ల్ ఫ్రెండ్ లేదని బెంగ ఎందుకు.. ఇది ఫాలో అవ్వండి చాలు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్‌కు సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే శుక్లా దరఖాస్తు చేసి నెల దాటినా అధికారులు సమాధానం ఇవ్వలేదు. దీంతో ధర్మేంద్ర శుక్లా ఉన్నతాధికారులను సంప్రదించారు.
Also Read: PM MODI: చిన్నారులతో సరదాగా గడిపిన ప్రధాని.. వీడియో షేర్
ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తును స్వీకరించడంతో పాటు సంబంధిత సమాచారాన్ని ఉచితంగా అందివ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో సంబంధిత పత్రాలను ఇంటికి తీసుకురావడానికి తన ఎస్‌యూవీని వినియోగించాల్సి వచ్చిందన్నారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ఎస్‌యూవీని తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.