కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని కొద్దికొద్దిగా చంపేస్తోందని ఖర్గే ఆరోపించారు.
కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి ఏకంగా 40 వేల పేజీల సమాచారం అధికారుల నుంచి అందింది. ఆ పత్రాలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లేందుకు ఏకంగా తన ఎస్‌యూవీని వినియోగించాల్సి వచ్చింది.