NTV Telugu Site icon

Blink It: బ్లింకిట్ నిర్వాకం.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం

Blink It

Blink It

Blink It: ప్రస్తుతం ఈ కామర్స్ బిజినెస్ వచ్చాక ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. బయటికి వెళ్లాల్సిన పని లేకుండా తమకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో ఉండే తెప్పించుకుంటున్నారు. దీంతో వారు షాపింగ్ చేసే టైం సేవ్ అవుతోంది. బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టో వంటి ఎన్నో యాప్స్ ప్రస్తుతం అందుబాటులోకి వ‌చ్చాయి. ఇలా ఆర్డర్ చేస్తే చాలు అలా ఇంటి ముందు వాలిపోతున్నాయి. అయితే ఈ యాప్‌ల‌తో త‌ల‌నొప్పులూ ఎదురవుతున్నాయి.

Read Also: Upma: బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా తింటే.. అమేజిక్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం

తాజాగా ఓ వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక కనిపించింది. తాను బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే తన‌కు డెలివ‌రీ యాప్ ఎలాంటి షాక్ ఇచ్చింద‌నే వివ‌రాల‌ను నితిన్ అరోరా అనే వ్యక్తి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. బ్రెడ్ ప్యాకెట్ డెలివ‌రీ త‌ర్వాత అందులో ఎలుక బతికే ఉందంటూ పేర్కొన్నాడు. ఈనెల 1న తాను బ్రెడ్ ప్యాకెట్‌కు ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుకను డెలివరీ చేశారని, బ్లింకిట్‌తో చేదు అనుభ‌వం ఎదురైంద‌ని పోస్ట్‌కు నితిన్ క్యాప్షన్ ఇచ్చాడు.

Read Also: Formula E Race: ఆహా.. స్టార్ హీరోల సతీమణులు.. పతులు లేకుండానే వచ్చారే