ఉప్మా చాలా నిధానంగా జీర్ణం అవుతుంది. దీంతో పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫలితంగా.. బరువు అదుపులో ఉంటుంది.
ఈ ఉప్మా రవ్వలో విటమిన్ బీ, ఈ ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో దోహదపడతాయి.
గోధుమ రవ్వ, వెజిబేటుల్స్‌తో తయారు చేసిన ఉప్మాతో ఫైబర్ కంటెంట్ అందుంతుంది. దీంతో, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
గోధుమ రవ్వ ఉప్మాలో పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇది కిడ్నీని ఆరోగ్యంగా ఉంచి, దాని ఫంక్షన్స్‌ని వేగవంతం చేస్తుంది.
గోధుమ రవ్వతో చేసే ఉప్మాలో.. న్యూట్రీషియన్స్ మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గోధుమ రవ్వ ఉప్మాలో మినిరల్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు.. ఎముకలను బలంగా తయారుచేస్తాయి.
గోధుమ రవ్వ ఉప్మాలో ఉండే ఐరన్.. అనీమియాను నివారిస్తుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది.
ఉప్మాలో వేరుశెనగ, జీడిపప్పు వల్ల వేసుకుంటే.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందుతాయి.