NTV Telugu Site icon

Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Kakinada

Kakinada

Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్టుండి నొప్పితో విలవిల్లాడటంతో.. వెంటనే రాజు పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఫలితం లేకపోయింది. శ్రీను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఇలాగే అవతార్‌-1కు కూడా జరిగింది. తైవాన్‌లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. డాక్టర్‌లు ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ఓవర్‌ ఎగ్జైట్‌ అయ్యాడని, దానీ వల్ల ఆ వ్యక్తికి అధిక రక్తపోటు వచ్చిందని తెలిపాడు. శ్రీనుకి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సినిమాకి వెళ్లిన అతను.. విగతజీవుడై ఇంటికి రావడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి.

Read Also: Anushka Shetty: యంగ్ కుర్రాడితో ప్రేమలో పడిన అనుష్క.. వివరాలివే

ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్‌-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌ తెచ్చుకుంది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ఈ విజువల్‌ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్‌-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన హాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ చిత్రం రూ.13 కోట్లకు పైగా షేర్‌ కలెక్షన్‌లను సాధించింది.

Show comments