NTV Telugu Site icon

Chennai: భార్య మోసానికి భర్త బలి.. ఇంటిని అమ్మిన డబ్బుతో ప్రియుడితో జంప్

Lover

Lover

Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది. గత నెల రోజులుగా భార్య సునీతకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం చెందిన బెంజమిన్ సౌదీ నుండి స్వగ్రామానికి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు.

Also Read: IND vs ENG: వన్డేలకు వేళాయే.. నాగ్‌పూర్‌ వేదికగా మొదటి మ్యాచ్

భార్యపై భర్తకు ఉన్న ఇష్టంతో ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో ప్రియుడితో పరారైన సునీత ప్రవర్తన భర్తను ఆత్మహత్యకు దారితీసింది. తన జీవితంలో జరిగిన మోసంపై బాధపడిన బెంజమిన్ వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లడించాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య సునీత, ఆమె ప్రియుడు సైజు అలాగే ఆమె చెల్లెలు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బెంజమిన్‌ మోసానికి గురై తన ప్రాణం తీసుకోవడం గ్రామస్థులను కలిచివేసింది. నమ్మకాన్ని ద్రోహంగా మార్చుకున్న సునీత కృత్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మనిషి జీవితంలో నమ్మకం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. విధి నడిపించిన ఈ ఘటన కుటుంబాన్ని సర్వం కోల్పోయేలా చేసింది.