NTV Telugu Site icon

Bengaluru: ఐపీఎల్ మ్యాచ్‌లో పాడైన ఆహారం.. కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్ ఎఫ్‌ఐఆర్

Bengaluru

Bengaluru

మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్, క్యాంటీన్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Read Also: Off The Record: తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ కంగారు..

ఖతార్ ఎయిర్‌వేస్ ఫ్యాన్స్ టెర్రేస్ స్టాండ్ నుండి తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి చైతన్య అనే వ్యక్తి స్టేడియంలో మ్యాచ్‌ చూడటానికి వచ్చారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో చైతన్య స్టాండ్‌లోని క్యాంటీన్‌లో భోజనం చేశాడు. నెయ్యి అన్నం, ఇడ్లీ, చన్నా మసాలా, కట్లెట్, రైతా, డ్రై జామూన్ తిన్నారు. అయితే.. తిన్న కొద్దిసేపటికే చైతన్యకు కడుపునొప్పి వచ్చింది.

Read Also: Off The Record: అక్కడ వైసీపీ, టీడీపీలకు వణుకు పుట్టిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి..!

ఆ తర్వాత చైతన్య కూర్చొని ఉండగానే కుప్పకూలిపోయాడు. స్టేడియం సిబ్బంది సహకారంతో స్టేడియం వెలుపల అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యుడు చైతన్యను పరీక్షించి ఫుడ్‌ పాయిజన్‌కి గురైనట్లు నిర్ధారించారు. కాగా.. క్యాంటీన్‌లో పాడైపోయిన ఆహారం తినడం వల్లే ఆరోగ్యం క్షీణించిందని చైతన్య ఆరోపించారు.