Site icon NTV Telugu

UP: అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ వివాదం.. సొసైటీ కార్యదర్శి ముక్కు కొరికిన వ్యక్తి (వీడియో)

Kanpur

Kanpur

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

పోలీసుల సమాచారం ప్రకారం.. ఫ్లాట్ యజమాని క్షితిజ్ తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరొకరి కారు పార్క్ చేయడాన్ని చూసి, అపార్ట్మెంట్ సొసైటీ కార్యదర్శి రూపేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు. రూపేంద్ర కారును అక్కడి నుంచి తరలించమని గార్డుకు సూచించాడు. అయినా క్షితిజ్ వినలేదు.. అతడిని కిందకు రమ్మని కోరాడు. కిందికి వచ్చిన సొసైటీ కార్యదర్శిని క్షితిజ్ దుర్భాషలాడాడు. అకస్మాత్తుగా రూపేంద్రపై దాడి చేసి, అతని ముక్కును గట్టిగా కొరికాడు.

READ MORE: IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్‌లో ‘ఆపరేషన్ సింధూర్‌’ స్పెషల్‌.. వారికి బీసీసీఐ ఆహ్వానం

ఆ ఘటనను చూసి సమీపంలోని వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గాయపడిన రూపేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన మొత్తం అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడు క్షితిజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ సంఘటన పట్టణ అపార్ట్‌మెంట్ సంస్కృతిలో పెరుగుతున్న పరస్పర శత్రుత్వం, ఉద్రిక్తతను మరోసారి హైలైట్ చేసింది.

READ MORE: Dil Raju: పవన్ మాటలతో ఏకీభవిస్తున్నా.. స్నాక్స్ రేట్లు తగ్గించాలి!

Exit mobile version