NTV Telugu Site icon

Naked On Street: వీధిలో నగ్నంగా నడిచాడు.. తన బట్టలు ఎక్కడో వదిలేశాడో కూడా తెలీదంట!

Florida

Florida

Naked On Street: ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నగ్నంగా వీధిలో నడుస్తున్నట్లు గుర్తించిన 44 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిన అరెస్ట్ చేసిన తర్వాత.. ఆ వ్యక్తి తాను వేరే గ్రహం నుంచి వచ్చినట్లు పేర్కొన్నాడు. వర్త్‌ అవెన్యూలోని 200 బ్లాక్‌లో ఓ దుకాణం దాటి ఆ వ్యక్తి నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న అతడిని చూసిన టబూకి చెందిన ఓ ఉద్యోగి పోలీసులకు కాల్‌ చేసిన సంఘటన మార్చి 8న జరిగింది.

Read Also: Man Smokes On Flight: ఎయిరిండియా విమానంలో ధూమపానం.. అమెరికా పౌరుడిపై కేసు నమోదు

పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తన ఒంటిపై నూలు పోగు లేకుండా వీధుల్లో నడిచాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తన బట్టలు ఎక్కడ వదిలేశానో తెలియదని, తన పేరు, పుట్టిన తేదీని కూడా చెప్పడానికి నిరాకరించాడు. నిందితుడిని ప్రశ్నించేందుకు అతడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా.. తన పేరు చెప్పడానికి నిరాకరించాడు. అతను ఏ రాష్ట్రం నుంచి సామాజిక భద్రతా నంబర్ లేదా ఐడీ కార్డును కలిగి లేడని కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడిని జాసన్ స్మిత్‌గా గుర్తించారు. జాసన్‌ స్మిత్‌ తాను వేరే భూమిపై నివసించినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత తాను వెస్ట్‌పామ్‌ బీచ్‌లో నివసించినట్లు పోలీసులకు తెలిపాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments