Mammootty: ఆ 4 నెలలు నరకం చూశాను..మమ్ముట్టి ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోయే ఆయన, గత ఏడాది కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. అసలు మమ్ముట్టికి ఏమైంది? ఆయన ఎందుకు కనిపించడం లేదు? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యపై మమ్ముట్టి మొదటిసారి నోరు విప్పారు.
Also Read : AA23 Sensation: 1 మిలియన్ రీల్స్‌తో ఐకాన్ స్టార్.. ‘23 థీమ్’ రికార్డు!
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
మమ్ముట్టి మాట్లాడుతూ..‘గత ఏడాది జూన్ సమయంలో అనారోగ్యం బారిన పడ్డారు. దీనివల్ల సుమారు 4 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా కాలం పాటు రుచి, వాసన కోల్పోయాను. అసలు గాలి పీలుస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాకపోతే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాను’ అని ఆయన చెప్పుకొచ్చారు. వినికిడి, కంటిచూపు కూడా దేవుడు ఇచ్చిన వరాలని, అవి లేని వారి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో తనకు అర్థమైందని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న మమ్ముట్టి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రాబోతున్న ‘పేట్రియాట్’ (Patriot) సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో మమ్ముట్టితో పాటు మరో లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. ఇక విలన్‌గా వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటిస్తుండటంతో ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!