పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బృందంపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆ బృందం అర్ధరాత్రి తర్వాత దాడులకు ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. వేళకాని సమయాల్లో దాడులు చేయడానికి అవసరమైన అనుమతి బృందానికి ఉందా అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. “అర్ధరాత్రి వారు ఎందుకు దాడి చేశారు..? వారు పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా..? అర్ధరాత్రి ఎవరైనా అపరిచితుడు ఆ ప్రదేశానికి వస్తే స్థానికులు ఎలా స్పందిస్తారో అలాగే స్పందించారు” అని బెనర్జీ చెప్పారు.
Also read: Hit and Run: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై హిట్ అండ్ రన్.. ఇద్దరు యువకులు మృతి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ బెనర్జీ, “ఎన్నికల ముందు ప్రజలను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ప్రతి బూత్ ఏజెంట్ ను అరెస్టు చేద్దామని బీజేపీ భావిస్తోందా..? ఎన్‌ఐఏ కు ఏ అధికారం ఉంది..? బీజేపీకి మద్దతిచ్చేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఈ నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. 2022 బాంబు పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు వెళ్లిన భూపతినగర్ ప్రాంతంలోని గ్రామస్థులు ఎన్‌ఐఏ అధికారుల పై దాడి చేశారు.
Also read: Sajjala Ramakrishna Reddy : చంద్ర బాబు తీరు పరకాష్ఠకు చేరింది
ఇందుకు సంబంధించి ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.., ఈ ఉదయం ఎన్‌ఐఎ అధికారుల బృందం ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, కోల్‌కతాకు తిరిగి వస్తుండగా వాహనంపై దాడి జరిగిందని తెలిపారు. స్థానికులు వాహనాన్ని చుట్టుముట్టి దానిపై రాళ్లు రువ్వారు. తమ అధికారి ఒకరు కూడా గాయపడ్డారని ఎన్‌ఐఎ తెలిపారు.
