Site icon NTV Telugu

Loksabha Elections 2024: బీజేపీకి ఓటు వేయకపోతే.. మీ పౌరసత్వం, మీ ఆధార కార్డు తీసేస్తారు..

Mamatha

Mamatha

West Bengal: ఈద్ జ‌రుపుకునేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వ‌చ్చిన వ‌ల‌స కూలీలు ఓటు వేయ‌కుండా తిరిగి వెళ్లొద్దని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు. మీరు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌కుంటే కాషాయ పాల‌కులు మీ ఆధార్ కార్డు, పౌర‌స‌త్వాన్ని తీసేస్తార‌ని పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో ఇవాళ ( శుక్రవారం ) జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచార సభలో దీదీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో సీఏఏను తాను ఎట్టి పరిస్థిత్తులో అమ‌లు చేయ‌బోన‌న్నారు. ఎన్ఆర్‌సీని ఇక్కడ అమ‌లు చేసేందుకు అనుమ‌తించ‌న‌ని స్పష్టం చేశారు. అస్సాంలో సీఏఏను అమ‌లు చేస్తుండ‌గా అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఇక, కాషాయ నేత‌లు ఇప్పుడు ఉమ్మడి పౌర‌స్మృతి (యూసీసీ) గురించి మాట్లాడుతున్నార‌ు.. యూసీసీని వారు తీసుకు వ‌స్తే ఏమ‌వ‌తుందో మీకు తెలుసా అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దాని వల్ల మీరు మీ గుర్తింపును కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని వెల్లడించింది.

Read Also: Shahrukh Khan: సల్మాన్ తర్వాత షారుఖ్.. భారీగా భద్రత పెంపు!

అలాగే, ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, వామపక్షాలపై కూడా మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్‌, వామపక్షాలు తృణమూల్‌ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించింది. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తాను.. కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.. ఇంత చేస్తే బెంగాల్‌లో కాంగ్రెస్‌- బీజేపీ కోసం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌, వామపక్షాలకు ఎవరూ ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చింది.

Exit mobile version