Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
- మమతా బెనర్జీ ఇంట్లో విషాదం
- ఇంట్లో మేనకోడలు ఆత్మహత్య
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సోదరుడు నిహార్ ముఖర్జీ కుమార్తె బ్రిష్టి ముఖర్జీ (28) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బీర్భూమిలోని రాంపూర్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుంబా గ్రామంలో మంగళవారం ఉదయం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమంగా ఉద్యోగం పొందిందనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో ఆమె ఉద్యోగాన్ని తొలగించారు. దీంతో ఆమె అప్పటి నుంచి మానసికంగా కృంగిబాటులో ఉంది. అంతేకాకుండా మరోవైపు విడాకుల కేసు కూడా విచారణలో ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉండడంతో ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
కొద్ది రోజులకే మరో విషాదం
రాంపూర్హాట్లోనే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించిన ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆశిష్ బెనర్జీ.. అవినీతి ఆరోపణలను ఖండిస్తూ, తనపై బురదజల్లేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్ వదిలినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!