Site icon NTV Telugu

Mamata Banerjee: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ

Mamata Banarjee

Mamata Banarjee

Mamata Banerjee Meets Arvind Kejriwal in Delhi: ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌కు గంటల ముందు ఈ సమావేశం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.

Read Also: Dawood Ibrahim: గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం!.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ డౌన్‌

డిసెంబర్ 19 (మంగళవారం)న ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమికి ఇది మొదిటి సమావేశం కాగా.. మొత్తానికి ఇది నాల్గవ సమావేశం. మూలాల ప్రకారం, డిసెంబర్ 20 బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ పొందారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల అంశంపై ఆమె చర్చించనున్నారు.

అంతకుముందు, ముందుగా షెడ్యూల్‌ చేయబడిన సమావేశాన్ని వాయిదా వేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు నిర్ణయించడంతో సమావేశం డిసెంబర్ 19కి వాయిదా పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున డిసెంబర్ 6న కాంగ్రెస్ సమావేశానికి పిలుపునిచ్చింది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ సగం మార్కును దాటడంతో, ప్రతిపక్ష కూటమి సమావేశం ప్రకటించింది.

Exit mobile version