Site icon NTV Telugu

Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?

New Project (4)

New Project (4)

న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్‌లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వాటిలో 55 మహిళలకు మాత్రమే. రాష్ట్రంలో 99 మానవ హక్కుల కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయవ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలన్నదే నా విజ్ఞప్తి. గోప్యత పాటించాలి.” అని పేర్కొన్నారు.

READ MORE: CM Revanth Reddy : వరంగల్‌ పర్యటనలో అధికారులపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్. శివగణనం కూడా ఉన్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ముఖ్యమంత్రి.. తాను కూడా న్యాయవాద సభ్యురాలు అని, న్యాయ వ్యవస్థ తనకు పవిత్ర దేవాలయం, చర్చి, మసీదు లేదా గురుద్వారా లాంటిదని అన్నారు. “నేను చట్టపరమైన సోదరభావంలో భాగమని భావిస్తున్నాను. నేను ఇప్పటికీ బార్ అసోసియేషన్‌లో సభ్యురాలిని. నేను కూడా కోర్టులో కొన్ని కేసులు వాదించాను. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ న్యాయవ్యవస్థ వెంటే ఉంటుందని, సామాన్య ప్రజలను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యత. వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు చేసింది. న్యాయవ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించకపోతే వారిని ఎవరు కాపాడుతారు? న్యాయవ్యవస్థ మాత్రమే తమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని సామాన్యులు విశ్వసిస్తారు. దేశ న్యాయవ్యవస్థను మెరుగుపరచడంలో జస్టిస్ చంద్రచూడ్ నిస్సందేహంగా సహాయపడ్డారు.” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version