కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలలో 50 శాతం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ఇప్పుడు ఆదరా బాదరాగా నోటిఫికేషన్ లు ఇస్తే.. పేపర్ లీక్ అయిందంటూ విమర్శించారు. రెండు వారాల తర్వాత సిట్ మేల్కొందా.. ఇప్పుడు సభ్యులు, ఛైర్మన్ ను విచారణ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టులో కాంగ్రెస్ వేసిన పిటిషన్ కు సమాధానం చెప్పేందుకు ఛైర్మన్ ను విచారిస్తున్నారని, టెన్త్ పేపర్ లీక్ పై నిరసన వ్యక్తం చేస్తే.. యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Sabitha Indra Reddy : అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తాము
నిరుద్యోగులు, విద్యార్థులు అంటే ప్రభుత్వంకు ఎందుకు ఇంత అలసత్వమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన లీకేజీ ల పాలన అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల కు అయ్యే ఖర్చు కేసీఆర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజ్ దీప్ సర్దేశాయి వాఖ్యలు తప్పయితే ఇంత వరకు ఎందుకు ఖండించలేదని ఆయన అన్నారు. మిగతా టెన్త్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోతే.. పిల్లలు, తల్లిదండ్రుల పక్షాన జైల్ భరో కార్యక్రమం తీసుకుంటామని మల్లు రవి స్పష్టం చేశారు.
Also Read : Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకువీరుడు.. చివరికి ఆమె చెప్పులు మోస్తూ..
