Site icon NTV Telugu

Mallikarjun Kharge: అమిత్ షాకు ఖర్గే లేఖ.. రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని వినతి..

Mallikarjuna

Mallikarjuna

రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. గౌహతి నగర సరిహద్దులో అస్సాం పోలీసు సిబ్బందితో రాహుల్ సహా కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడిన తర్వాత ఈ లేఖ రాశారు. అయితే, నిన్న (మంగళవారం) భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి గౌహతిలోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

Read Also: IND vs ENG: కేఎల్ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడు.. కేఎస్ భరత్‌కు లైన్ క్లియర్!

ఈ ఘటనలో బారికేడ్‌ను బద్దలు కొట్టేందుకు ప్రజలను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జీపీ సింగ్‌ను ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆదేశించారు. ఆ తర్వాత రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ సభ్యులపై కేసు నమోదు చేశారు. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు గౌహతి ప్రధాన రహదారుల్లోకి రాకుండా హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించిన కాంగ్రెస్ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా గాయపడ్డారు.

Read Also: Congress: నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

ఇక, అసోం పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని హోం మంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ Z+ భద్రతకు అర్హుడని తెలిపారు. ఇది కాకుండా, కాంగ్రెస్ పోస్టర్లను చింపివేయడంతో పాటు జనవరి 21న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పర్యటనను అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడిని గురించి ప్రస్తావించారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ పని జరిగిందని ఖర్గే ఆరోపించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ దగ్గరికి వచ్చేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు పర్మిషన్ ఇచ్చారు అని మల్లికార్జున మండిపడ్డారు.

Exit mobile version