నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఖర్గే పాల్గొననున్నారు. సంగారెడ్డి గంజి మైదాన్ లో మధ్యాహ్నం 12 గంటలకు 30 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెదక్ లోని రాందాస్ చౌరస్తాలో మధ్యాహ్నం 3.30 గంటలకు కార్నర్ మీటింగ్ జరుగనుంది. సంగారెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్ లో మల్లికార్జున ఖర్గే రానున్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు ఖర్గే.
Also Read : Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం
నేరుగా సంగారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ లంచ్‌ను ముగించుకుని హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. ఇక సోమవారం (30న) జనగామ, ఆలేరు, భువనగిరి.. 31న నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సు యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read : Bhatti Vikramarka: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం.. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలి