Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో 96 శాతం పోలింగ్ జరిగింది. 9,900 మంది పీసీసీ ప్రతినిధుల్లో 9,500 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. చిన్న రాష్ట్రాల్లోనూ వందశాతం ఓటింగ్ జరిగినట్టు ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో 87 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సీనియర్ నేత ఖర్గే విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల దాకా కొనసాగిందన్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రంలో 100శాతం ఓటింగ్నమోదైందన్నారు. అన్ని చోట్ల 90శాతానికి పైగా పోలింగ్ రికార్డయినట్టు వివరించారు. ప్రశాంతయుత వాతావరణంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ ఎన్నికలతో చూపించిందన్నారు. ఇది రహస్య ఓటింగ్అని, ఎవరు.. ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదని, ఈ విషయంలో భయపడొద్దని మిస్త్రీ తెలిపారు. 19న ఏఐసీసీ ఆఫీస్‌లోనే ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పారు. చెల్లని ఓట్లను పక్కనపెట్టేసి.. ఎవరికైతే 50శాతానికి పైగా ఓట్లు నమోదవుతాయో వారే కాంగ్రెస్అధ్యక్షుడిగా ఎన్నికవుతారని వివరించారు.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
Also Read
ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన 68వ పోలింగ్ బూత్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత బయటికొచ్చిన సోనియా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశానని సోనియా గాంధీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ లీడర్లు జైరాం రమేశ్, అంబికా సోని, అజయ్ మాకెన్, వివేక్తన్ఖాతో పాటు పలువురు నేతలు ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో ఓటేశారు.
Read Also: Fighter jet crashes: భవనంపై కుప్పకూలిన యుద్ధవిమానం.. చెలరేగిన మంటలు
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ సహా సీనియర్ నేతలు ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాబట్టి ఖర్గే ఎన్నిక లాంఛనమేనని చెబుతున్నారు. కాగా, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబం అభిప్రాయాలను కూడా వినాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి పి.చిదరంబరం అన్నారు. గాంధీయేతర నేత పగ్గాలు స్వీకరించినప్పటికీ ఫస్ట్ ఫ్యామిలీ గొంతు మూగబోయినట్టు కాదని స్పష్టం చేశారు. సోనియా ఎప్పటికీ తమకు నాయకురాలేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!