Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dev: వెండితెరపై ఎంతటి క్రూరమైన విలన్ పాత్రనైనా అలవోకగా పోషించే నటులు కూడా నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొంటుంటారు. ప్రేక్షకులకు కనిపించేది రంగుల ప్రపంచమే కానీ వాటి వెనుక అసలు విషయాలు అరుదుగానే వెలుగులోకి వస్తాయి. అలాంటి జీవితాన్నే గడిపిన నటుల్లో రాహుల్ దేవ్ కూడా ఒకరు. భార్యను కోల్పోయిన తర్వాత తన జీవితమే శూన్యంగా మారిపోయిందని, అప్పటికే డబ్బు, పేరు, గుర్తింపు అన్నీ ఉన్నప్పటికీ తన చిన్న కొడుకును ఎలా పెంచాలో కూడా తెలియని పరిస్థితి ఎదురైందని ఆయన తాజాగా మాట్లాడిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. వివాహమైన 11 సంవత్సరాల తర్వాత ఆయన భార్య రీనా కన్నుమూయడంతో కుటుంబంపై ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉండగా, భార్య మరణం తర్వాత అతని బాధ్యత మొత్తం రాహుల్ భుజాలపై పడింది. ప్రస్తుతం 57 ఏళ్ల వయస్సులో ఉన్న ఆయన ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండా తన కుమారుడికే ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ఇటీవల గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజుల గురించి రాహుల్ దేవ్ మనసు విప్పారు. ఒకప్పుడు తన దగ్గర డబ్బు, కీర్తి, అవార్డులు అన్నీ ఉన్నాయని, నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. కానీ జీవిత భాగస్వామి మరణించిన తర్వాత తన చిన్న కొడుకును ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అనే విషయంలో పూర్తిగా అయోమయంలో పడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో తన జీవితంలో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకపోయేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
భార్యే ఇంట్లో పిల్లల బాధ్యతలను పూర్తిగా చూసుకునేదని, తాను ఎక్కువ సమయం షూటింగ్‌ల కోసం బయటే ఉండేవాడినని రాహుల్ వివరించారు. అప్పట్లో ముంబైలో షూటింగ్‌లు తక్కువగా జరిగేవని, ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోనే షూటింగ్ ఉండటంతో ప్రతి 20 నుంచి 25 రోజులకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడినని చెప్పారు. నటుల జీవితం బయటకు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, కుటుంబానికి సమయం కేటాయించడం చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక బిడ్డ జీవితంలో తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని, తన భార్య అద్భుతమైన తల్లి అని రాహుల్ దేవ్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. భార్య మరణించిన తర్వాత ఒక తండ్రిగా తాను కూడా కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చిందని, పిల్లల పెంపకం అంటే ఏమిటో అప్పుడే అర్థమైందని చెప్పారు. కాలక్రమేణా తన కుమారుడితో కలిసి ప్రయాణిస్తూ తండ్రిగా తన బాధ్యతలను నిర్వర్తించానని, ఇప్పుడు నా కొడుకే నాప్రపంచమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాహుల్ దేవ్ నటి ముగ్ధా గోడ్సేతో డేటింగ్ లో ఉన్నారు. 2020 నుంచి ఇద్దరూ కలిసి జీవిస్తున్నప్పటికీ, ఆయన అధికారికంగా రెండో వివాహం చేసుకోలేదు. ముఖ్యంగా ముగ్ధాకు రాహుల్ కుమారుడితో కూడా మంచి అనుబంధం ఉండటం వారి బంధాన్ని మరింత బలంగా నిలబెట్టిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, వృత్తిపరంగా మాత్రం రాహుల్ దేవ్ ఇప్పటికీ బిజీగానే కొనసాగుతున్నారు. బుల్లితెరతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఆయన చేతిలో ప్రస్తుతం కూడా పలు చిత్రాలు ఉన్నాయి. జీవితంలో ఎదురైన విషాదాన్ని అధిగమించి, కుమారుడి కోసం నిలబడ్డ తండ్రిగా ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!