Site icon NTV Telugu

Mallikarjun Kharge: రాజ్యసభలో ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ఫైర్‌..

Karge

Karge

Mallikarjun Kharge: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీరుపై కాంగ్రెస్‌ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే త్రీవ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లోక్‌ ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొట్టారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బీజేపీ సరైన బుద్ది చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మంగళసూత్రాలు అమ్మెస్తారంటూ మోడీ తప్పడు ప్రచారం చేశారు.. ప్రధాని స్థాయిలో ఉండి ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేయటం సరికాదు అని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

Read Also: Babli Project Gates: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

అలాగే, ఓటర్లను సైతం ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం దేశానికి చాలా ప్రమాదకరం.. దీని వల్ల మహిళలు, దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు’అని అన్నారు. ఇక, ఖర్గే వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఉప రాష్ట్రపతి తొలగించారు. అయితే, దీనికంటే ముందు లోక్‌సభలో నీట్‌ పరీక్షపై చర్చ జరపాలని ఇండియా కూటమిలోని పార్టీలు పట్టుబట్టాయి. నీట్‌పై లోక్‌సభలో చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. విపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Exit mobile version