Congress : కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారని కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న ‘సంవిధాన్ బచావో’ ప్రదర్శనలో వారు పాల్గొనబోతున్నారు.
Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల జరిగిన సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, జనవరి 26, 2024 నుంచి జనవరి 26, 2026 వరకు దేశవ్యాప్తంగా ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ యాత్రను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం పార్టీ శ్రేణులకు రాసిన లేఖలో, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్టీ విస్తృత కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ‘సంవిధాన్ బచావో’ ఉద్యమానికి ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనబోతున్నారు.
UP: ఓ షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్.. కస్టమర్లకు చుక్కలు చూపించిన మంకీ