NTV Telugu Site icon

Mallikharjuna Kharge: పేదల హక్కులను హరించేందుకు చూస్తోంది.. బీజేపీపై తీవ్ర విమర్శలు

Karge

Karge

బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనుకుంటోందని.. అది పేదల సంక్షేమం కోసం కాదని అన్నారు. వారి హక్కులను హరించేందుకేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి వర్గం మెజారిటీ దిశగా పయనిస్తోందని.. అది గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. అందుకే ‘మంగళసూత్రం’, ‘హిందూ’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Health Tips : కాఫీని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాలి..

భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఖర్గే తెలిపారు. మరోవైపు.. మోడీ, ఆయన అనుచరులు పదేపదే చెబుతున్నారని, తమకు 400లకు పైగా సీట్లు వస్తాయంటున్నారని తెలిపారు. కానీ.. పేదలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రజల సంక్షేమం కోసం పట్టించుకోవడం లేదని.. పేద ప్రజల హక్కులను హరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.

AP Pensions: రేపటి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ

ఇంతకుముందు ఏ బీజేపీ నాయకుడూ ఇలాంటి పథకాల గురించి మాట్లాడకపోతే.. రాజ్యాంగాన్ని మార్చబోనని లేదా రిజర్వేషన్‌లను అంతం చేయనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎందుకు స్పష్టం చేయాల్సి వచ్చిందని ఖర్గే ప్రశ్నించారు. దేశంలో 55 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, ఎవరి మంగళసూత్రాన్ని దోచుకోలేదని ఖర్గే సూచించారు. “మేము బలవంతంగా పన్నులు వర్తింపజేసి, ప్రజలను జైలులో పెట్టడానికి ED, CBIలను దుర్వినియోగం చేసామా? అని ప్రశ్నించారు.