NTV Telugu Site icon

Mallikarjun Kharge: తెలంగాణ నా వల్లే వచ్చిందంటూ ఆయన చెప్పుకుంటున్నారు..

Mallikarjuna Karge

Mallikarjuna Karge

తెలంగాణ కోసం అందరూ పోరాటం చేశారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకి స్వాతంత్రం ఇచ్చారు.. కేసీఆర్ పార్టీ బలం ఎంత అప్పుడు.. సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది.. ఒక్క వ్యక్తి ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుంటున్నారు అని ఆయన అన్నారు. సోనియాగాంధీని కలిసి ఫోటో దిగారు.. ఏఐసీసీ నుండి బయటకు రాగానే అన్ని మర్చిపోయారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Karthikeya: హీరోను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి.. ఆ పని చేయకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ

మేం కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చాం.. వాటిని అమలు చేస్తున్నామని మల్లికార్జున ఖర్గే అన్నారు. మేం మాట ఇచ్చాం అంటే అమలు చేస్తాం.. కర్ణాటకలో గృహ లక్ష్మీ పథకం కూడా అమలు కాబోతోంది అని తెలిపారు. కాంగ్రెస్ ఏం చేసింది అని ఇక్కడ అంటున్నారు.. 500 సంస్థానాలు భారత్ లో కలిపింది కాంగ్రెస్.. హైదరాబాద్‌కు స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్.. దేశంలో అందరిని ఏకతాటిపైకి తెచ్చింది కాంగ్రెస్, ఇస్రో, డీఆర్‌డీవో, బీహెచ్‌ఈఎల్‌ ఎవరు ఏర్పాటు చేశారు అంటూ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Read Also: Kenya Power Outage: కరెంటు కోతలతో కెన్యా అతలాకుతలం.. 14 గంటలు చీకట్లోనే..

పబ్లిక్ సెక్టార్ అంతా ఏర్పాటు చేసింది కాంగ్రెస్.. హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు.. ఎడక్క పోయినా కంపెనీలు పెట్టింది కాంగ్రెస్‌.. దేశంలో పెద్ద ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్.. తినడానికి అన్నం.. చదవడానికి స్కూల్స్ పెట్టింది కాంగ్రెస్.. జమీందారి వ్యవస్థను రద్దు చేసింది అని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు. భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్.. బ్యాంక్‌లు జాతీయం చేసింది కాంగ్రెస్.. జనం చెప్తున్నారు కాంగ్రెస్ ఏం చేసిందో.. కేసీఆర్ కి తెలియదా..? మోడీ వచ్చి.. మేం తెచ్చి వన్నీ అమ్మేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

Read Also: Rakshabandhan: నేపాల్‌లో రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారో తెలుసా..!

మోడీ, కేసీఆర్ మధ్య దోస్తీ కుదిరింది.. మాటలు తగ్గాయి.. మోడీని దించడానికి అందరూ ఒక్కటైతే.. కేసీఆర్ ఒక్క మీటింగ్ కి రాలేదు అని మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీకి మద్దతుగా ఉన్న కేసీఆర్ ని ఓడించండి అని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసి పని చేయండి.. అధికారంలోకి వస్తాం.. రాహుల్ గాంధీ ప్రజల కోసం మాట్లాడితే.. పార్లమెంట్ నుండి బయటకు పంపారు.. భయపడే వాణ్ణి కాదని రాహుల్ గాంధీ నిలబడ్డారు.. సీడబ్ల్యూసీలో చేర్పులు ఉంటాయి.. ఇంకా కొన్ని పేర్లు చేర్చుతామని మల్లికార్జున ఖర్గే అన్నారు. పీవీ నరసింహారావు సీలింగ్ ఆక్ట్ తెచ్చింది కాంగ్రెస్ అని అన్నారు.

Read Also: Patnam Mahender Reddy: మంత్రి మహేందర్ రెడ్డికి శాఖలు కేటాయింపు

ప్రజాగర్జన వేదిక మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే సూచన చేశారు. అందరూ కలిసి పని చేయండి.. అధికారంలోకి వస్తాం.. . బీసీలకు ఏం ఇవ్వలేదు అన్న వి.హనుమంతరావు.. నేను వచ్చిన తరువాత 67 శాతం పదవులు పెంచానని ఖర్గే చెప్పారు. ఇంకా కొన్ని పేర్లు సీబ్య్లూసీ కమిటీలలో వస్తాయని ఆయన తెలిపారు. సీబ్య్లూసీలో బీసీలకు ప్రాధాన్యత లేదని వీహెచ్ అన్నాడు.. దీనికి ఖర్గే అన్నారు.. తొందర పడకండి.. మీక్కూడా అవకాశం వస్తోందిని తెలిపారు.