NTV Telugu Site icon

Malla Reddy : అసెంబ్లీలో మల్లారెడ్డి మసాలా.. స్పీకర్‌ను షాక్ ఇచ్చిన కామెడీ పంచ్..!

Mallareddy

Mallareddy

Malla Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన హాస్యశైలితో నవ్వులు పూయించారు. పంచ్ డైలాగులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి, తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ, “నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 1100 కోట్లు లాభం వచ్చే అంశం, రెండోవది మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి” అని మల్లారెడ్డి అన్నారు. ఇది విన్న అసెంబ్లీ సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. స్పీకర్ హస్తక్షేపం చేసి, “రెండు వద్దు, ఒక్కదానికే అనుమతి” అని సూచించారు.

దీంతో మల్లారెడ్డి తన నియోజకవర్గ పరిస్థితిని వివరించడం ప్రారంభించారు. “మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది. 61 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. పదేళ్ల రిజర్వేషన్ల విధానం తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలోనే అన్ని రద్దు చేసింది. దయచేసి ఇదే రిజర్వేషన్ కొనసాగించాలి. మమ్మల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దు” అంటూ ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం మల్లారెడ్డి “ఇప్పుడు ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతాను” అని ప్రారంభించగానే స్పీకర్ మళ్లీ అడ్డుకున్నారు. దీంతో సభలో మరికొంత హాస్యరసం నెలకొంది. మల్లారెడ్డికి ప్రసంగం పూర్తి చేసే అవకాశం లేకపోయినప్పటికీ, ఆయన మాటలు అసెంబ్లీని కాసేపు ఉల్లాసంగా మార్చాయి.

Bombay High Court: “ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం విడాకులకు కారణమే”..