వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని విజయవాడ కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు స్ధానిక నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆరాధ్య దైవం వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుతోందన్నారు. 2004 పాదయాత్ర తరువాత రైతుల నాయకుడిగా అధికారంలోకి వచ్చారని, వైఎస్సార్ సంస్కరణలలో ఆరోగ్యశ్రీ ప్రధానమైనదని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళగలిగేలా చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని, చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఏం చేయలేడని ఆయన అన్నారు. వైఎస్సార్ చేయాలనుకున్న ప్రతీదీ జగన్ చేస్తున్నారని, 2024లో జగన్ మరల తిరిగి అధికారంలోకి వచ్చేలా పార్టీ యంత్రాంగం అంతా పనిచేస్తున్నామన్నారు.
Also Read : Modi Warangal Tour: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
అనంతరం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కంటే చక్కని పరిపాలన వైఎస్సార్ చేసారని, చంద్రబాబు పాలనలో వెన్నుపోటు, అవినీతి, అరాచకాలకు ట్రేడ్ మార్క్ అన్నారు. వైఎస్సార్ బిడ్డగా నాలుగడుగులు ముందుకేసారు జగన్ అని, వైఎస్సార్ ఆశయాలతో జగన్ పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ లకు నాలుగేళ్ళకు తరువాత వైఎస్సార్ గుర్తొస్తున్నారని విమర్శించారు. అంనతరం మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. పరిపాలనాదక్షులుగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారని, కాకి బ్రతుకు బ్రతికిన చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జగన్ మహిళలకు ప్రతీ పదవిలోనూ పెద్దపీట వేసారని, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమన్నారు.
Also Read : Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 9 వేల మంది మృతి..