NTV Telugu Site icon

Malladi Vishnu: సీఎంపై దాడి చేసింది టీడీపీ వాళ్లే..! ఆధారాలున్నాయి..

Malladi Vishnu

Malladi Vishnu

Malladi Vishnu: విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌పై రాయితో దాడి చేయడం కలకలం సృష్టించింది.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇక ఈకేసులో వైసీపీ ఎమ్మెల్సీ మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీకి చెందినవాళ్లే దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఆయన.. విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగడం బాధాకరం అన్నారు. ఏపీ మొత్తం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎవ్వరూ చేయని విధంగా జరుగుతున్నాయి.. సామాజిక ధర్మం పాటించిన వ్యక్తి సీఎం జగన్‌ అని అభివర్ణించారు. బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా అందరికీ సమన్యాయం జరిగింది. మీ పాలనలో పెన్షన్ ఎందుకు పెంచలేదు, ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాపీ ఎందుకు కొడుతున్నారు? అని నిలదీశారు. మా నవరత్నాలు సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు కూటమి కాపీ కొడుతున్నారని విమర్శించారు మల్లాది.

Read Also: T. Rajaiah: కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి

ఇక, వాలంటీర్ వ్యవస్థ ను కాపీ కొడుతున్నారు.. 2014లో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని చంద్రబాబును నిలదీశారు మల్లాది విష్ణు.. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయాల లబ్ధి చేకూరుతుందన్న ఆయన.. చంద్రబాబు పాలనలో 12 శాతం పేదరికం ఉందని.. కానీ, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో అది 6 శాతానికి తగ్గిపోయిందన్నారు. సీఎం జగన్‌ పై పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. సోషల్ మీడియాలో సీఎం జగన్ పై చేస్తున్న దుష్ర్పచారం బాధ కలిగిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.